హైదరాబాద్: ఏపీపీఎస్సీ 2,815 పోస్టుల భర్తీకి 10 నోటిఫికేషన్లు విడుదల చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(1716), డిప్యూటీ సర్వేయర్లు(432), ఏఎస్‌ఓ( 394) ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్స్(116), డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు(56), ఎఫ్‌డీవో(35), చిల్డ్రన్ హోంసూపరింటెండెంట్స్(31), సీనియర్ ఎంటమాలజిస్ట్ (11), పోర్టు ఆఫీసర్లు(2) పోస్టులకు నోటిఫికేషన్లు వెలువరించింది.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు జూలై 1న, డిప్యూటీ సర్వేయర్ల పోస్టులకు ఏప్రిల్ 22న, ఏఎస్‌ఓ పోస్టులకు జూన్ 24న రాత పరీక్ష జరగనుంది.
పోర్టు ఆఫీరర్ల పోస్టులకు ఫిబ్రవరి 26న, ఎఫ్‌డీవో పోస్టులకు మార్చి 4న, సీనియర్ ఎంటమాలజిస్ట్ పోస్టులకు మార్చి 25న, చిల్డ్రన్ హోంసూపరింటెండెంట్స్ పోస్టులకు ఏప్రిల్ 15న, డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు పోస్టులకు ఏప్రిల్ 29న, ఇండస్ట్రీయల్ ప్రమోషన్ ఆఫీసర్స్ పోస్టులకు మే 6న పరీక్షలు నిర్వహించనుంది. |
0 comments:
Post a Comment